Saturday 5 December 2015

ఓ రాయి కన్నీరు

॥ఓ రాయి కన్నీరు॥
ఓ మనిషి
నేను పుట్టాను నీతో కలిసి....ఇంకా చెప్పాలంటే నీ కన్నా ముందే...
నాకు నీకు పెద్ద తేడా ఏం లేదు
నా గుండె ఓ రాయి
నీ గుండె ఓ కసాయి
నాకు ఆకారం అంటూ ఏం లేదు..
కాలం అనే దారిలో మీకు ఆయుధంగా మారి రూపం మార్చుకుంటున్నాను...కాదు కాదు మీరే మార్చుతున్నారు
సృష్ఠి స్టార్టింగ్లోనే
మీ ఆకలి వేట కోసం నాతో వేవేల రూపాల ఆటలు ఆడారు..
ఒకడు ఉలితో చంపుతాడు
ఇంకొకడు నిప్పు కోసం చంపుతాడు
గ్రానైట్ బాంబులతో బెంబెలెత్తిస్తున్నారు...
ఆఖరికి నేను కన్నీరు కార్చే క్షణాలను కూడా
మీ సంగీత ప్రతిభని ఆపాదించేసుకున్నారు
ఎంత స్వార్ధం.....
నా బాధను అర్ధం చేసుకోగలవాడి కోసం వెతికాను
వెతుకుతున్న ప్రతీసారి ఓ చేయి నన్ను తడిమేది
నన్ను అర్ధం చెసుకున్నాడు అనుకొని మురిసిపోయా..
ఇంతలోనే తెలుసుకున్న మనిషికి నేనొక వ్యర్ధపదార్ధం అని
వేల కన్నుల మధ్య నా ప్రయాణం
ఓ కంటిపాప దగ్గర ఆగిపోవడం నేను గమనించాను
తీక్షణంగా నన్నే చూస్తు ఏదో రాస్తున్నాడు
అతని కళ్లలో ఆనందం నేను చూసాను(బాధ కూడా)
నాకు ఏదో లోక రహస్యం చెప్పబోతున్నట్టు తెలుస్తుంది
చిన్న కాగితం పై నన్ను పెట్టి వెళ్లిపోయాడు(బహుస ఎగరకుండ ఉండాలని అనుకుంటా)
అప్పుడు చూసా ఆ కాగితం పై అక్షరాలను

అతనెవరో అప్పుడు తెల్సింది
"క"నిపించి "వి"నిపించి వెళ్లిపోయాడు.

23/3/15

No comments:

Post a Comment