Sunday 6 December 2015

బెజుబాన్ ఙ్ఞాపకం


#బెజుబాన్ ఙ్ఞాపకం #
1.
గతపు గదిలో బూజుపట్టిన ఙ్ఞాపకాన్ని
వెలుగు రేఖనై తట్టిలేపుతున్న
తన మెటిక విరుపు చప్పుళ్ళకై
ఎక్కడని చూడాలి నిన్ను
గుండె పగుళ్ళ మధ్యన
మునివేళ్ళ మొనల్లోన
రెప్పల దుప్పటిలోన
నన్ను నా నీడను కలిపిన
అవ్యక్త ఆకారంలోన
ఎందుకో కొన్ని క్షణాలెప్పుడూ మౌనంగా మాటాడుతాయి
నిన్ను రా(పూ)సుకున్న హృదయ దేహంతోనో
నిన్ను ది(అ)ద్దుకున్న ఙ్ఞాపక గేహంతోనో
జారిపోతున్న కాలాన్నడిగా
రాలిపోతున్న భాష్పాన్నడిగా
అడిగేలోపే కరిగిపోయాయి
అచ్చు ఆమె నీడలా.
2.
నేను
డిఫ్యూస్డ్ స్పృహల మధ్య నలిగిపోతూ
అన్నోన్ అయోమయాల్లో తగలబడిపోతూ
నేను
క్లస్టర్ కన్నీళ్ళ కెరటాల్లో కనుమరుగవుతూ
ఫ్లస్టర్ ఫ్రస్ట్రేషన్లో ప్యాథటిక్ గీతమవుతూ

3.
నువ్వు మాత్రం
నన్ను మనిషిగా కాక నగిషీగా చూస్తూ

29/9/15

No comments:

Post a Comment