Sunday 6 December 2015

తమకాల జల్లు


||తమకాల జల్లు ||
అబ్బ ఏంటి ఇలా...
తమకపు తపనల తలపుల్లో తడిపేస్తూ
తన తనువు అణువుల్లో బందీని చేేస్తుంది.
ఆమె పెదవి విరుపులో మత్తెక్కించే మోహాలు
పున్నమి మల్లెలై మెరుస్తుంటాయి
పంటిగాటు ప్రేమలన్ని లెక్కపెడుతూ నువ్వు
శ్వాసతో స్పర్శించే స్పర్శలను లెక్కపెడుతూ నేను
ఒకర్ని ఒకరం కలిపేసుకుందాం
నా దొసిలిలో వయ్యారాలన్ని నెమ్మదిగా ఒంపేస్తూ ఉన్నపుడు తన నయనాలు పలికే మౌనభాష ఎంత తియ్యగా ఉంటుందో
ఓయ్ ....ఓయ్...ఓయ్ ..అంటూ తియ్యగా చంపేస్తావు...
నాలోని నన్ను లాగేయడానికి ఈ ఒక్క పిలుపు చాలదూ....
అయినా ఏమని రాయను
నా మాటలన్నీ నీకు ఇచ్చేశాక
నీ శబ్దాలన్ని నిశ్శబ్దంగా రాస్తూ సాగిపొవడం తప్ప...
సైలెన్స్ ఎంత స్వీట్ గా ఉంది అన్నపుడు నీలో తెలియని పులకరింత చూసా
సైలెన్స్ ఎంత సెక్సీ గా ఉందో అన్నప్పుడు
నీలో రెగిన గిలిగింతల్ని చూసా
ఇంతకీ నిన్నెప్పుడు చూస్తానో....
నిను చేరే నిమిషమే నాకు సమస్తం తెల్సా..
క్షణాలని యుగాలుగా పోల్చడం నాకు ఇష్టం లేదబ్బ...
క్షణాలే యుద్దాలై దాడిచేస్తుంటే
ఒక్కో క్షణం తో రణం చేస్తూ అమాంతం నిను అల్లుకుపోవాలనిపిస్తుంది....
మది మధనాల చిలకరింతల్లో పొంగే
మోహ రసాల్లో ఒక్కటై నిలువెల్లా తడిసిపోదాం
భువనానికి అందని భావప్రాప్తికై నింగికెగసి పోదాం

16/8/15

No comments:

Post a Comment